పల్నాడు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మారిందని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ నిర్వహించి,అధ్యయ నాల ప్రకారం పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, యడ్లపాడు,కారెంపూడి, గురజాల, దుర్గి, మాచర్ల, మాచవరం మండలాలలో భూగర్భ జల మట్టం 7 నుండి 20 మీటర్ల లోతుకు పడిపోయింది. అలాగే బొల్లాపల్లి మరియు వెల్దుర్తి మండలాలలో ఇది 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరింది. ఈ తొమ్మిది మండలాలను తీవ్ర నీటి సంక్షోభ ప్రాంతాలుగా గుర్తించి, మొత్తం 169 గ్రామాలను నీటి కొరతతో బాధపడుతున్నవిగా గుర్తించారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా “జలధారా–జలహారతి” కార్యక్రమం కింద ఈ మండలాలలో గరిష్ట స్థాయిలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
ముఖ్యంగా వర్షపు నీటిని నిల్వ చేసే నిర్మాణాలు (వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్) విస్తృతంగా ఏర్పాటు చేయాలి. గ్రామాలలో ఉన్న చెరువు లను100%శాతం నీటితో నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ద్వామా పీ.డీ సిద్ధ లింగ మూర్తిని ప్రత్యేక అధికారి గా నియమించినట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని
చెరువులకు నీరు చేరే ఫీడర్ కాలువల్లో మట్టి పేరుకుపోవడం (సిల్టింగ్), అక్రమ ఆక్రమణలు (ఎన్‌క్రోచ్‌మెంట్) లేదా కాంటూర్ ట్రెంచ్‌లు అడ్డంకిగా మారినచో వాటిని అత్యంత ప్రాధాన్యత తో తొలగిం చాలి. నీటి ప్రవాహం నిరంతరంగా కొనసాగేం దుకు అవసర మైన మరమ్మతులు, శుభ్రపరిచే పనులు తక్షణమే చేపట్టా లని జిల్లాలోని అన్ని గ్రామాలకు,9 మండ లాలకు ఆదేశించారు.
సమావేశంలో ద్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, గ్రౌండ్ వాటర్ డి.డి రామ్ బాలాజీ రెడ్డిలు
అదే విధంగా, నీటి సంరక్షణలో భాగంగా అన్ని ప్రభుత్వ భవనాల లో తప్పనిసరిగా రూఫ్ టాప్ రైన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు.
మున్సిపల్ పరిధిలో కొత్తగా నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్న ప్పుడు, నివాస లేదా వాణిజ్య భవనాలు అయినా సరే, ముందుగా రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం ఏర్పాటు చేసిన తరువాత మాత్రమే అనుమతులు మంజూరు చేయాలి అని అన్నారు.
ఏపీ వాల్టా యాక్ట్ ప్రకారం, భూగర్భ జల వినియోగాని కి ముందుగా గ్రౌండ్ వాటర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి అన్నారు.
ఈ ఎన్.ఓ.సి లేకుండా వ్యవసాయ బోర్‌వెల్‌లకు కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయరాద న్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు భూగర్భ జలాల సంరక్షణకు,భవిష్యత్ తరాలకు నీటి భద్రతను కల్పించేందుకు కీలకంగా మారనున్నాయి.
ప్రజలందరూ ఈ కార్యక్ర మంలో భాగస్వా ములు కావాలని, నీటి వినియో గంలో జాగ్రత్తలు పాటించా లని అధికారులు కోరుతు న్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు,జిల్లా హార్టికల్చ ర్ అధికారి ఐ. వెంకట్రావు, వై. నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags: Shukla’s “Jaladhara–Jalaharati” Program