April 21, 2026
Explore
స్టాల్స్ నిర్వహణను అడ్డుకున్న వ్యాపారుల అసోసియేషన్

స్టాల్స్ నిర్వహణను అడ్డుకున్న వ్యాపారుల అసోసియేషన్

April 21, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణం, నీరురుగట్టు వారిపల్లెలోని ఓ కళ్యాణ మండపంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 40 మంది వ్యాపారులు (సిగ్నేచర్ ) స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు అతి తక్కువ ధరలోనే అనేక రకాల ఆభరణాలు ఇతర వస్తువులు లభిస్తునడంతో కొనుగోలు చేయడానికి క్యూ కట్టారు. దీన్ని గమనించిన స్థానిక వ్యాపారుల అసోసియేషన్ నాయకులు కళ్యాణ మండపం వద్దకు చేరుకుని వ్యాపారం చేయరాదంటూ అడ్డుకొని స్టాల్స్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తాము ప్రభుత్వానికి అన్ని రకాల పనులు చెల్లించి వ్యాపారం చేసుకుంటుంటే దానికి వ్యాపారుల అసోసియేషన్ పేరుతో వచ్చి తమను ఈ విధంగా అడ్డు కోవడం తగదని స్టాల్స్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న రెండవ పట్టణ ఎస్ఐ నాగేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని రెండు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక వ్యాపారుల అసోసియేషన్ ఎస్సై మాటలను లెక్కచేయకుండా బిస్మించుకు కూర్చుని నిరసనకు పూనుకున్నారు. ఈ విషయమై ఎస్ఐ మాట్లాడుతూ.. వ్యాపారాలని క్లోజ్ చేయించే రైట్స్ తమకు లేవని మున్సిపల్ కమిషనర్, సేల్స్ టాక్స్, పైస్థాయి అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గొడవపడి లా అండ్ ఆడర్ ఇష్యూ తీసుకు వస్తే. ఇరు వర్గాలపై కేసులో నమోదు చేయాల్సి వస్తుందని ఎస్ఐ హెచ్చరించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. స్టాల్స్ నిర్వాహకులు తక్కువ ధరకే వ్యాపారాలు చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని తమ కుటుంబాలు వీధిని పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు గుణతాధికారులు స్పందించాల్సి ఉంది.

Tags: Traders’ Association Obstructs Operation of Stalls