పుంగనూరు ముచ్చట్లు:
శృంగేరి పిఠాధిపతి శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను బ్రాహ్మణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఆర్‌కె.రామకృష్ణ ఆధ్వర్యంలో శంకరాచార్యుల విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్డులో గల శ్రీ ప్రసన్న పార్వతిదేవి సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు శంకర్‌శర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు ఉపనయన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. పలువురు బ్రాహ్మణ యువకులు నూతన వలు పంపిణీ చేసి యజ్ఞోపవీపధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రాహ్మణ యువకులు గాయత్రిదేవి పూజా కార్యక్రమాలను వివరించారు. బంధుమిత్రులతో కలసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ గౌరవ అధ్యక్షులు కోదండరామయ్య, శశికుమార్, టివిఎస్.ప్రసాద్, మురళి లతో పాటు బ్రాహ్మణులు రవికుమార్, సరస్వతమ్మ, కళావతి, శ్రీవాణి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

Tags: Special Worship for Adi Shankaracharya