July 25, 2026
Explore
టమాట ధరలపై అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దు: మార్కెట్ కమిటీ చైర్మన్

టమాట ధరలపై అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దు: మార్కెట్ కమిటీ చైర్మన్

July 25, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మార్కెట్ యార్డులో టమాట ధర కిలో రూ.3 మాత్రమే ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరామ్ తెలిపారు. గత రెండు రోజుల్లో కిలో రూ.7 నుంచి రూ.11 వరకు, ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ.12 నుంచి రూ.15 వరకు ధర పలుకుతోందన్నారు. ఈ ఏడాది మార్కెట్‌కు టమాట సరఫరా పెరగడంతో కొద్దిరోజులు ధరలు తగ్గినా ప్రస్తుతం మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం 60 మెట్రిక్ టన్నుల టమాటను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించిందని వెల్లడించారు.

Tags: Do not believe false propaganda regarding tomato prices: Market Committee Chairman