April 21, 2026
Explore
ద్విచక్రవాహనాలు ఢీ ఇద్దరికి గాయాలు

ద్విచక్రవాహనాలు ఢీ ఇద్దరికి గాయాలు

April 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

అతివేగంగా ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇరువురు గాయపడి ఆసుపత్రి పాలైన సంఘటన మంగళవారం పట్టణ సమీపంలోని గాంధిపురం వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం వీరప్పల్లెకి చెందిన శివకుమార్‌ (27) , కుదవపల్లెకి చెందిన ఆంజప్ప (47) లు తమ పనుల నిమిత్తం పుంగనూరు సమీపంలో వెళ్తుండగా అతివేగంగాఎదురెదురుగా రెండు వాహనాలు వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర రక్తగాయాలైంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన ఇద్దరిని 108లో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇరువురు చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags; Two-wheeler Collision: Two Injured