April 21, 2026
Explore
బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం..!

బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం..!

April 21, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ నాచారంలో విషాదం..!

హైదరాబాద్ ముచ్చట్లు:

ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ లో రీల్స్ చేస్తూ ఫేమ్ అవ్వాలనుకున్నాడు బాలుడు..! ఈ క్రమంలో కొన్ని రిస్కీ స్కిట్స్ చేయాలనుకున్నాడు..! అదే ఆలోచన బాలుడి ప్రాణాలకే ముప్పు తెచ్చింది..!

బాల్కనీ రైలింగ్ పిట్ట గోడపై ఫీట్స్ చేస్తుండగా పొరపాటున కిందపడిపోయాడు.. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు..!

నాచారం మల్లాపూర్ గాంధీ బొమ్మ దగ్గర బస్తీలో నివసించే కుటుంబానికి చెందిన బాలుడు మితున్ (14) సమీపంలోని పాఠశాలలో చదువుతున్నట్లు తెలుస్తోంది.. స్నేహితులు ఎక్కువగా రీల్స్ వీడియోలు చేస్తుండటం చూసి తాను కూడా చేయడం మొదలుపెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై మృతి చెందాడు.. బాలుడి కుటుంబం బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది..!

Tags: The Obsession with ‘Reels’ Claims a Boy’s Life!