రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట (మం) కారంపల్లి పంచాయతీలో ని కృష్ణమ్మ చెరువు లో సోమవారం మధ్యాహ్నం అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ను అధికారులు పట్టుకున్నారు.
గత కొద్ది రోజులుగా కృష్ణమ్మ చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్న స్థానికుల సమాచారంతో ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులు దాడి చేసి ట్రాక్టర్ ను పట్టుకున్నారు.
అధికారులు వస్తున్నారన్న సమాచారంతో చెరువులో ఉన్న 3 ట్రాక్టర్లు , ఒక జెసిబి పారిపోగా , ఒక ట్రాక్టర్ పట్టుబడింది.
అక్రమ మట్టి రవాణా కు పాల్పడితే కటిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
Tags: Tractor Illegally Transporting Soil Seized