April 20, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

April 20, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట మండలం పోలి చెరువు కట్టపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కీర్తిపాటి సుధాకర్ రాజు (56) మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఆయన డివైడర్‌ను ఢీకొనడంతో ఘటన చోటుచేసుకుంది.

ప్రస్తుతం చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సుధాకర్ రాజు, గతంలో మన్నూరు, రాజంపేట పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల సహచర పోలీసు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags: Constable dies in road accident.