పుంగనూరుముచ్చట్లు:
ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని వెనుకవైపు నుంచి బలోరా వాహనం ఢీకొనడంతో బలోరా డ్రైవర్ గాయపడిన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె నుంచి పలమనేరు వెళ్తున్న లారీ, బలోరా వాహనాలు ఒకదాని వెనక ఒకటి వస్తున్నాయి. ఈ క్రమంలో బైపాస్‌రోడ్డులోని యూఎన్‌ఆర్ సర్కిల్ వద్ద గల స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా వెనుకవైపు నుంచి బలోరా వాహనం లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బలోరా డ్రైవర్ ఎం.రవిచంద్ర(55) గాయపడగా , లారీ వెనుకభాగం పాక్షికంగా దెబ్బతింది. రవిచంద్రను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు లారీకి నష్టం జరిగిందని లారీ కె.శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Bolero accidentally rams into a lorry.