మదనపల్లె ముచ్చట్లు:
సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లె శాఖ రూ.8 లక్షల విలువైన 10 కంప్యూటర్ సిస్టమ్స్‌ను జిల్లా యంత్రాంగానికి అందజేసింది. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని కోర్టు హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంకు ప్రతినిధులు కంప్యూటర్ పరికరాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా అందించేందుకు ఈ కంప్యూటర్ పరికరాలు ఉపయోగపడతాయని తెలిపారు. సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించిన యూనియన్ బ్యాంక్ ప్రతినిధులను ఆయన అభినందించారు.
ప్రభుత్వ అవసరాలకు తోడ్పాటునందిస్తూ ప్రజాసేవల్లో భాగస్వాములవుతున్న సంస్థలు మరిన్ని ముందుకు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి అందుతున్న సహకారం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags: 10 computer systems worth ₹8 lakh donated as part of social responsibility.