గాలివీడు ముచ్చట్లు:
గాలివీడు మండలంలో జరిగిన భారీ గృహ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. చోరీకి గురైన 210 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు నేరానికి ఉపయోగించిన కేటీఎం బైక్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కుటుంబ భూవివాదాల నేపథ్యంలో పాత కక్షతోనే ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందని రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ తెలిపారు.
సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి గాలివీడు మండలం పేరంపల్లి సమీపంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ ధీరజ్ అభినందించారు.
Tags; Major theft case solved within 48 hours; two arrested.