April 20, 2026
Explore
శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి జయంతి మహోత్సవాలు

శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి జయంతి మహోత్సవాలు

April 20, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో ఘనంగా శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి జయంతి మహోత్సవాలు

టీటీడీ ఆధ్వర్యంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ మరియు శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త నిర్వహణలో శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి వార్ల జయంతి మహోత్సవాలు సోమవారం తిరుమలలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

వైశాఖమాసం రోహిణి నక్షత్రం సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా తిరుమల శ్రీ వైఖానస ఆశ్రమంలో విశేష పూజలు, నివేదనలు, మంగళ నీరాజనం కార్యక్రమాలు నిర్వహించారు.

మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన సభలో పండితులు పాల్గొని శ్రీ భృగు మహర్షి మరియు శ్రీ వైఖానస సిద్ధాంతం, భక్తి తత్వం, సంస్కార జీవనం, శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం, సమాజ శ్రేయస్సు వంటి అంశాలపై ఉపన్యాసాలు అందించారు.

అలాగే పండితుల మధ్య చర్చాగోష్టి కూడా నిర్వహించారు.

అనంతరం శ్రీ శార్జ్ఞపాణి అయ్యంగార్ రచించిన శ్రీ విఖనసస్తోత్రరత్నావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో దీవి శ్రీనివాస దీక్షితులు, ప్రొఫెసర్ వేదాన్తం విష్ణుభట్టాచార్యులు, శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు, ఇతర పండితులు పాల్గొన్నారు.

Tags:Birth Anniversary Celebrations of Sri Bhrigu Maharshi and Sri Srinivasa Makhi