April 20, 2026
Explore
అగ్నిప్రమాదాల నివారణే మా ధ్యేయం

అగ్నిప్రమాదాల నివారణే మా ధ్యేయం

April 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

సమాజంలో జరుగుతున్న అగ్నిప్రమాదాల నివారణే లక్షంగా క్రమశిక్షణతో పని చేస్తున్నట్లు ఇన్‌చార్జ్ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం భగత్‌సింగ్‌ కాలనీలోని అగ్నిమాపక కేంద్రంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆయన ప్రజలతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ ఈనెల 14 నుంచి ప్రారంభించిన అగ్నిమాపక వారోత్సవాలలో అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండ ప్రమాదం జరిగిన వెంటనే స్పదిస్తూ , ప్రమాదాల నివారణకు అగ్నిమాపకశాఖ ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. నివారణకు సహకరిస్తున్న అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుబ్రమణ్యం, లక్ష్మీనారాయణ, ప్రసాద్‌, వెంకట్రమణ, కేశవ, వినోద్‌కుమార్‌, మోహన్‌బాబు, ప్రకాష్‌, ఆనంద పాల్గొన్నారు.

Tags: Preventing fire accidents is our goal.