April 20, 2026
Explore
హనుమకొండలో విద్యార్థినిపై దారుణం..

హనుమకొండలో విద్యార్థినిపై దారుణం..

April 20, 2026 | Andhra Pradesh

హనుమకొండ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ఓ కళాశాలలో విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. ఇంటర్ చదువుతున్న జూనియర్ విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థి మోసం చేసి, స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. బట్టలు విప్పించి వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది. గమనిక: బాధితుల వివరాలను గోప్యంగా ఉంచడం చట్టరీత్యా అవసరం కాబట్టి, విద్యార్థిని పేరును ఇక్కడ పేర్కొనడం లేదు.

Tags: Atrocity against a female student in Hanumakonda.