అమరావతి ముచ్చట్లు:
తుఫాన్ తీరం దాటిన ముప్పు ఇంకా తొలగలేదు ఇవ్వాలా కూడా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపుబలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటం తో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పాఠశాల లకు అధికారులు సెలవు ప్రకటించారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మ న్యం, విజయనగరం జిల్లాల ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సూచించింది.రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తుఫాన్ ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం తో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించా రు. బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, అధికా రుల సూచనలు పాటించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
Tags:Heavy rains in AP today?