పుంగనూరు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కెరీర్ గైడెన్స్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలర్ మణికంఠ చేత స్థానిక మున్సిపల్ హైస్కూల్ మేలు పట్ల నందు మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే వివిధ కార్యక్రమాలు మరియు చిత్రలేఖనం, వకృత్వం, ఫోకస్, అటెన్షన్, మెమొరి విభాగాల్లో పోటీలను నిర్వహించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం చే గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికేట్ లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొని విద్యార్థులకు మానసిక ఆరోగ్య ఆవశ్యకత గురించి తెలియజేశారు.
Tags:Mental Health Day programs at the Municipal High School in Melupatla