April 20, 2026
Explore
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ సిండికేట్ గుట్టు రట్టు.. ఆరుగురు అరెస్ట్

ఏపీలో క్రికెట్ బెట్టింగ్ సిండికేట్ గుట్టు రట్టు.. ఆరుగురు అరెస్ట్

April 20, 2026 | Andhra Pradesh

ఏలూరు ముచ్చట్లు:

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం పోలీసులు అరెస్టు
చేశారు. ఈ నెల 17న రాజుల కాలనీ లోని ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. అక్కడ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని
విచారించగా హైదరాబాద్లో ప్రధాన నిందితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో అక్కడికి వెళ్లి ఐదుగురిని అరెస్టు చేశారు. వీరంతా మెయిన్ బుకీ, సబ్
బుకీలుగా వ్యవహరిస్తూ బెట్టింగ్ యాప్లను నడుపుతూ పందెం వేసేవారిని ఆకర్షిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.2.30 లక్షల నగదు
స్వాధీనం చేసుకున్నారు.

Tags: Cricket Betting Syndicate Busted in AP; Six Arrested