పుంగనూరుముచ్చట్లు:
యుక్త వయస్సులో ఉన్న బాలికలకు హెచ్‌పివి వ్యాక్సిన్ వేసుకోవడం ఎంతో అవసరమని తూర్పువెహోగసాల పిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ రంజిత తెలిపారు. శుక్రవారం పిహెచ్‌సిలో 15 సంవత్సరాలలోపు వయసు గల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సిన్‌ను వేశారు. గర్భాశయానికి క్యాన్సర్ రాకుండ నిరోధించడానికి ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్ వేయడం జరుగుతోందన్నారు. దీని ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. యుక్త వ యసు బాలికలు ఆసుపత్రిని సంప్రదించి వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
Tags: HPV vaccines are essential for girls.