October 26, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

October 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

బొలోర వాహనం ద్విచక్రవాహనదారుడిని ఢీకొన్న ప్రమాదంలో దంపతులు గాయపడిన సంఘటన సోమవారం చండ్రమాకులపల్లె మలుపు వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు మండలంలోని యల్లారుబైలు గ్రామానికి చెందిన శంకర్‌(40), లావణ్య(35) దంపతులు తమ గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మదనపల్లె నుంచి ఎదురుగా వస్తున్న బొలోర వాహనం చండ్రమాకులపల్లె మలుపు వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో శంకర్‌ తలకు తీవ్రగాయంకావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Couple injured in road accident