పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ముడెప్ప సర్కిల్‌లో వాల్మీకిమహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు సోమవారంనిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ శివ మాట్లాడుతూ రామాయణ మాహకావ్యంతో ప్రపంచానికి ధర్మం, సత్యం, మానవతా విలువలను చాటిచెప్పిన ఆదికవి వాల్మీకి మహర్షి అని తెలిపారు. శ్రీరాముడు ప్రజసేవను తన ప్రథమ కార్తవ్యంగా భావించారని , ప్రజల సంక్షమమే లక్ష్యంగా రామరాజ్య నిర్మాణానికి కృషి చేశారని పేర్కొన్నారు. యువత మతపరమైన అంశాలకే పరిమితం కాకుండా సామాజిక సమస్యలు, ఉపాధి, విద్య, సమానత్వం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. అలాగే వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. ఈకార్యక్రమంలో అద్దాలనాగరాజ, సుకుమార్‌బాబు, రెడ్డి, అప్ప, రాజశేఖర్, శ్రీనివాసులు, జయరామ్, రెడ్డెప్ప, వెంకటపతి, రమణ తదితరులు పాల్గొన్నారు.
Tags:Valmiki Jayanti Celebrated Grandly