-వ్యక్తి మృతి
పుంగనూరుముచ్చట్లు:
సోమల మండలం కందూరు-నిమ్మనపల్లె మార్గ మధ్యంలో శనివారం అతివేగంగా వస్తున్న బలోరా వాహనం ద్విచక్రవాహనదారుడిని ఢీకొనడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మండలంలోని పెద్ద ఉప్పరపల్లెకి చెందిన రిహాన్(38) ద్విచక్రవాహనంపై నిమ్మనపల్లెకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు.
Tags: Balora vehicle collides with two-wheeler.