పుంగనూరుముచ్చట్లు:
పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసియుండు శ్రీ శనేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి తైలాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి దూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి పూజలు చేసి, నువ్వుల దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
Tags: Special Worship to Lord Shaneshwara