తిరుపతి ముచ్చట్లు:
- జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,టీటీడీ సీవీ & ఎస్‌ఓ మురళీకృష్ణ వారి ఆదేశాలు.
- గాలి గోపురం, 7వ మైల్ ప్రాంతాల్లో తనిఖీలు.
- 58 మంది సిబ్బంది, 2 బృందాలు 63 షాపులు తనిఖీ.
- 6 షాపులకు నోటీసులు 4 అనుమానితులు అదుపులోకి, 2 వాహనాలు స్వాధీనం.
- నిషేధిత వస్తువులపై హెచ్చరికలు.
- తిరుమల: భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలలో గాలి గోపురం, 7వ మైల్ ప్రాంతాల్లో నాఖాబందీ కార్యక్రమం నిర్వహించారు.
- ఈ కార్యక్రమం ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సీవీ &ఎస్‌ఓ మురళీకృష్ణ వారి ఆదేశాల మేరకు, తిరుమల డీఎస్పీ పర్యవేక్షణలో చేపట్టబడింది.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ వజ్రపహార్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. భక్తుల భద్రతకు భంగం కలిగించే విధంగా నిషేధిత వస్తువులు వినియోగించరాదని, గంజాయి, మద్యం, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను తీసుకురావడం, వినియోగించడం చేయరాదని షాపులలో పనిచేసే సిబ్బందికి కఠినంగా సూచనలు చేయడం జరిగింది.
- పోలీస్ సహా పలు విభాగాల 58 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి 63 షాపులను తనిఖీ చేసి, లైసెన్సులు, సిబ్బంది వివరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు లేని 6 షాపులకు నోటీసులు జారీ చేయగా, సరైన గుర్తింపు లేని నలుగురిని అదుపులోకి తీసుకుని, 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
- నిషేధిత వస్తువుల వినియోగంపై కఠిన హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, షాపులు నిబంధనల ప్రకారం నడపాలని, అపరిచితులకు ఇవ్వకూడదని సూచించారు. అత్యవసర నంబర్లు 112, 1972 పై అవగాహన కల్పించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ప్రజలను కోరారు.
Tags: Naka Bandi operation conducted in Tirumala.