తిరుమల ముచ్చట్లు:
తమిళనాడు రాష్ట్రం చంగల్ పట్టు ప్రాంతానికి చెందిన 12 సంవత్సరాల ఆదర్శ్ అనే బాలుడు అలిపిరి మెట్ల మార్గంలో సుమారు 2500వ మెట్టు వద్ద తప్పిపోయిన విషయం టీటీడీ విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలిసింది.
వెంటనే స్పందించిన ఏవీఎస్వోలు సిబ్బందిని అప్రమత్తం చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుమలలోని PAC-2 ప్రాంతంలో బాలుడు కనిపించినట్లు విజిలెన్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.
అనంతరం ఆదర్శ్‌ను సురక్షితంగా లేపాక్షి సర్కిల్‌లోని విజిలెన్స్ కార్యాలయానికి తీసుకువచ్చి ఎవీఎస్వో వెంకట శివ కుమార్, కృష్ణయ్య సమక్షంలో అతని బంధువులకు అప్పగించారు.
ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి బాలుడి బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తప్పిపోయిన బాలుడిని త్వరితగతిన గుర్తించి సురక్షితంగా అప్పగించిన విజిలెన్స్ సిబ్బందిని టీటీడీ ఉన్నతాధికారులు అభినందించారు.
Tags: Boy who went missing on the Alipiri steps route safely handed over.