సత్యసాయి ముచ్చట్లు:
విజిబుల్ పోలీసింగ్‌తో పాటు స్మార్ట్ పోలీసింగ్ చేపట్టాలి
రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టండి
సమాజానికి హానికరంగా మారిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలి
జిల్లాలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లను పూర్తిగా అరికట్టాలి
ఓపెన్ డ్రింకింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలి
జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్
జిల్లాలో నేరాలతో పాటు చోరీల నియంత్రణకు ప్రతి పోలీస్ అధికారి బాధ్యతగా పని చేసి ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
శనివారం పుట్టపర్తి సాయి ఆరామంలో నిర్వహించిన జిల్లా స్థాయి నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులు, రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమాజానికి హానికరంగా మారిన వ్యక్తులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని, చోరీలు, చైన్ స్నాచింగ్‌లు, మిస్సింగ్ కేసులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
వివిధ కేసులపై సమీక్ష
గ్రేవ్ U i,మహిళా నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్ కేసు ఎన్‌డీపీఎస్ కేసులు, హత్యలు, చోరీలు, రోడ్డు ప్రమాదాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలు, పెండింగ్ కేసులు, ముద్దాయిల అరెస్టులపై ఎస్పీ విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ వారీగా కేసుల పురోగతిని అడిగి తెలుసుకుని, ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ముద్దాయిల అరెస్టు పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేకంగా ఆరా తీశారు.
క్రైమ్ రేట్ తగ్గించడమే లక్ష్యం..
జిల్లాలో మహిళా నేరాలు, చిన్నారులపై నేరాలు, ప్రాపర్టీ నేరాలు, చోరీలు, చైన్ స్నాచింగ్‌లు, గొడవలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి రవాణా, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, వైట్ కాలర్ మోసాలు వంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు.
గతంలో నమోదైన కేసులు, ముఖ్యంగా ఆరు నెలల్లో పెరిగిన కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ప్రతిరోజూ హైవేలపై పెట్రోలింగ్ నిర్వహించాలని, రాత్రిపూట బీట్ సిస్టమ్‌ను పక్కాగా అమలు చేయాలని సూచించారు. చోరీ కేసులు జరిగిన వెంటనే వాటిని చేదించాలన్నారు.
పాత నేరస్తుల ఇళ్లకు వెళ్లి వారి ప్రవర్తనను పరిశీలించాలని, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీ షీట్లు తొలగించిన వారు తిరిగి నేరాలకు పాల్పడితే వెంటనే షీట్లు రీఓపెన్ చేయాలని ఆదేశించారు.
జిల్లాలో కొత్తగా సంచరిస్తున్న అనుమానాస్పద వ్యక్తులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
స్మార్ట్ పోలీసింగ్ తో పాటు
విజిబుల్ పోలీసింగ్ చేపట్టి ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని తెలిపారు. దీంతో నేరాలు సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందన్నారు.
చిన్నచిన్న నేరాలకు పాల్పడే వారితో పాటు పాత నేరస్తులపై కూడా దృష్టి సారించాలని, ప్రధానమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలి.
సైబర్ నేరాలు, మహిళా భద్రత, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ..
వివిధ కేసుల చేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గోరంట్ల సీఐ శేఖర్, పరిగి ఎస్ఐ రంగడు, సోషల్ మీడియా & సైబర్ క్రైమ్ సీఐ గోపీనాథ్ రెడ్డి, సోమిందేపల్లి, సికె పల్లి ఎస్ఐలు సుధాకర్ యాదవ్, సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్‌చార్జ్ సుదర్శన్ రెడ్డి, కానిస్టేబుళ్లు సురేష్ బాబు, రాజేష్, రాజ్‌కుమార్, అలాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో ప్రతిభ చూపిన లోకేశ్వర్, కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్‌లకు జిల్లా ఎస్పీ క్యాష్ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.
“ప్రతి పోలీస్ అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తేనే పోలీస్ శాఖ గౌరవం పెరుగుతుంది” అని ఎస్పీ ప్రేరణనిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు,అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ఐపీఎస్, డీఎస్పీలు మహేష్, నర్సింగప్ప, శివనారాయణ స్వామి, A R డీఎస్పీ,శ్రీనివాసులు , ఎస్బీ సి ఐ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ సీఐ నరేందర్ రెడ్డి, డీటీఆర్‌బీ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి, సీఐ ఇస్మాయిల్, ఇతర సీఐలు, ఎస్ఐలు dpo అధికారులు,మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: The police must work vigorously to control crime.