April 18, 2026
Explore
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ నందు APTF ధర్నా

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ నందు APTF ధర్నా

April 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పిలుపుమేరకు నేడు మదనపల్లె నందు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జానం మధుసూదన యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి గత మూడేళ్లుగా రావాల్సిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించి అలాగే పిఆర్సి కమిటీని నియమించి మద్యంతర భృతిని ప్రకటించాలని తెలియజేశారు. ప్రతి ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క కష్టాలను తెలుసుకొని వారికి రావలసిన న్యాయమైనబకాయిలను సరెండర్ లీవుల ఎంకాష్మెంట్ ప్రకటించాలి ఇప్పటివరకు చెల్లించకపోవడం శోచనీయం అని తెలియజేశా రు. నేటి జీవన విధానానికి అనుగుణంగా మారుతున్న ధరల రేటుకు అనుకూలంగా జీతభత్యాలను పెంచుట ప్రభుత్వం యొక్క విధి, కానీ ఆ వీధిని ప్రభుత్వం విస్మరించినది కనుక మా న్యాయమైన డిమాండ్లను వెంటనే స్పందించి నాకు రావాల్సిన అభ్యంతర భృతి30% ప్రకటించాలి. 12వ పిఆర్సి కమిటీని అందించాలి .అలాగే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలి.సిపిఎస్ రద్దును చేయాలి. కేజీబీవీలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలి సమాన పనికి సమాన వేతనం కావున ఎన్ని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా నిమ్మకనీరు ఎత్తినట్టు ఉండడం తగదు అని తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం నేడు ఉద్యోగుల ఉపాధ్యాయుల వలనేనే ఈనాడు పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం అని, ఎన్నోసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తెలియజేశారు .

కానీ ,వారి యొక్క సమస్యలను పరిష్కరించుటలో నిదానం చేస్తున్నారు వెంటనే ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మరియు విద్యా శాఖ మంత్రి ప్రతిస్పందించి తగు చర్యలను తీసుకొని మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడంలో భాగస్వాములుగా వచ్చినటువంటి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు జిల్లా వైస్ ప్రెసిడెంట్ పా ణ్యం నారాయణ ,బిల్లు నాయక్, సదుము శ్రీనివాసులు Ex.dist GS,సొరకాయల శ్రీనివాసులు CPS state vice president ,రామకృష్ణ శంభు ప్రసాద్, జిల్లాగౌరవ సలహాదారులు గుంజు కృష్ణయ్య , రాయచోటి మండల ప్రెసిడెంట్ గిరిబాబు జనరల్ సెక్రెటరీ మహమ్మద్ ఆలీ వీరవల్లి మండల ప్రెసిడెంట్ గంపల మహేశ్వరయ్య, వాల్మీకిపురం మండల ప్రెసిడెంట్ జనరల్ సెక్రెటరీ జి కవిత మరియువెంకటరమణ శ్రావణి ఓబులవారిపల్లి మండల ప్రెసిడెంట్ వాల్మీకిపురం గౌరవ సలహాదారులు సిద్దయ్య మొదలవారి పాల్గొన్నారు.

Tags: APTF Dharna at the Annamayya District Collectorate