April 18, 2026
Explore
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..

April 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేబినెట్ సమావేశంలో విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్నారు. దీనికి విపక్షాలు తప్పకుండా ఫలితం అనుభవిస్తాయని అన్నారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలన్నారు మోదీ. నారీశక్తి వందన్‌ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.

కేబినెట్ సమావేశంలో విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్నారు. దీనికి విపక్షాలు తప్పకుండా ఫలితం అనుభవిస్తాయని అన్నారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలన్నారు మోదీ. నారీశక్తి వందన్‌ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.. ఇప్పటికే.. విపక్షాల తీరును కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ తప్పు పట్టారు. విపక్షాల తీరుపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడే అవకాశం ఉంది. అంతేకాకుండా.. పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన పరిణామాలు.. అదేవిధంగా బిల్లులకు మద్దతు ఇవ్వకపోవడం సహా.. పలు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుధీర్ఘంగా ప్రసంగించనున్నారు.

మహిళల హక్కులకు కాంగ్రెస్‌ వ్యతిరేకమన్నారు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు. రాజకీయ దురుద్దేశంలో ఈ బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు. లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొందడంలో విఫలమవడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడారు.. ఇతర కాంగ్రెస్ ఎంపీలు కూడా తనను కలిశారని.. ప్రభుత్వ ఉద్దేశాలు చాలా మంచివేనని, కానీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంగీకరించడం లేదని, అందుకే ఎవరూ ఆయనను ఒప్పించలేమని వారు చెప్పారు. మనం ఏం చేయగలం?… అంటూ రిజిజు పేర్కొన్నారు.

Tags: Prime Minister Modi addresses the nation.