“స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పారిశుద్ధ్య సేవా కార్యక్రమాలు.
అనకాపల్లి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా, ఈ నెల (ఏప్రిల్ 2026) మూడవ శనివారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, లక్ష్మి, గణేష్, ఎస్సైలు ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు, అంజిబాబు, సురేంద్ర కుమార్, ప్రకాశరావు మరియు కార్యాలయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని శ్రమదానం చేశారు.
ఈ నెల ప్రధాన లక్ష్యాలు:
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ నెల కార్యక్రమం ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించింది:
వ్యర్థ రహిత సంస్థలు: పోలీస్ కార్యాలయ పరిసరాలతో పాటు మరియు చెత్త రహితంగా తీర్చిదిద్దడం.
హరితాంధ్ర – పర్యావరణం: కార్యాలయ ప్రాంగణాల్లో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడం మరియు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం.
సంపూర్ణ పారిశుద్ధ్యం: సామూహిక మరుగుదొడ్లు మరియు బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసి, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్మించడం.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛమైన వాతావరణం, ఆరోగ్యకరమైన సమాజం మరియు సుస్థిర సంపద కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” యొక్క అంతిమ లక్ష్యం.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం బాధ్యతగా భావించాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు.
Tags: Golden Andhra — Clean Andhra