అమరావతిముచ్చట్లు:
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిలచంద్ర పునేఠాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠా 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక పునేఠాను విజిలెన్స్ కమిషనర్ గా నియమించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని 5 ఏళ్ల పదవీకాలం గత నెల 31తో ముగిసిన నేపథ్యంలో.. ఎస్ ఈసీగా పునేఠాను నియమించారు.
Tags: State Election Commissioner Anil Chandra Punetha