రిపోర్టర్ ఇంటి ముందర క్షుద్ర పూజలు
రాజీవ్ గాంధీ నగర్ – అమీర్ నగర్ మార్గంలో ఘటన
రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తుల క్షుద్ర పూజలు
ఇంటి వాకిట్లో నిమ్మకాయలు, కోడిగుడ్లు, రాగిపిండి,ఎండుమిరపకాయలు
ఉదయం బయటకు వచ్చిన కుటుంబ సభ్యులకు షాక్
భయాందోళనలో స్థానికులు… ఆందోళన వ్యక్తం
ఇది దుష్టపనినా..? లేక బెదిరింపులా..? అనుమానాలు
బాధితులు పోలీసులకు ఫిర్యాదు
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
కదిరి ముచ్చట్లు:
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో కలకలం రేగింది. రాజీవ్ గాంధీ నగర్ నుంచి అమీర్ నగర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న రిపోర్టర్ రామకృష్ణ ఇంటి ముందర క్షుద్ర పూజలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వాకిట్లో నిమ్మకాయలు, కోడిగుడ్లు, రాగిపిండి, ఎండుమిరపకాయలు ఉంచి పూజలు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ఈ ఘటనను గమనించిన వారు భయాందోళనకు గురయ్యారు.
ఇది ఎవరి పని..? ఎందుకు చేశారు..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. బాధితులు పోలీస్ లకు పిర్యాదు,ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags;Sensation in Kadiri Town…