March 12, 2026
Explore
అలిపిరి వద్ద భక్తుల లగేజి కౌంటర్‌ను పరిశీలించిన టీటీడీ ఈవో

అలిపిరి వద్ద భక్తుల లగేజి కౌంటర్‌ను పరిశీలించిన టీటీడీ ఈవో

March 12, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన లగేజి డిపాజిట్ కౌంటర్ పనితీరును టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర పరిశీలించారు. టిటిడి సివిఎస్వో కేవీ మురళీకృష్ణ తో కలిసి గురువారం టిటిడి ఈవో తనిఖీలు నిర్వహించారు.

భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో తమ లగేజిని కౌంటర్‌లో డిపాజిట్ చేయగా, వాటిని భద్రంగా తిరుమలకు తరలించే విధానంపై అధికారులు ఈవోకు వివరించారు. లగేజి డిపాజిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా రూపొందే క్యూఆర్ కోడ్‌తో కూడిన రసీదు భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు.

సాధారణ రోజుల్లో సుమారు 6 వేల బ్యాగులు, ప్రత్యేక పర్వదినాల్లో 10 వేల వరకు బ్యాగులు తిరుమలకు భద్రంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

అనంతరం ఈవో లగేజి కౌంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో అలిపిరి ఏవిఎస్వో రమేష్ కృష్ణన్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: TTD EO inspects devotees’ luggage counter at Alipiri