: మాజీ జూనియర్ అసిస్టెంట్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశం
చిలకలూరిపేట ముచ్చట్లు:
స్థానిక మున్సిపాలిటీలో పన్నులు, పన్నేతర వసూళ్లలో నకిలీ రసీదులు జారీ చేసి, వసూలైన మొత్తాన్ని క్రమం తప్పకుండా ఖజానాకు జమ చేయకుండా నిధులను దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అప్పటి జూనియర్ అసిస్టెంట్ ఎస్.కె. కలేష పై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సవరించిన పింఛను నియమావళి, 1980లోని నియమం-9 ప్రకారం చర్యలు ప్రారంభించాలని పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు (G.O.MS.No. 82) జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ (CC&A) నియమావళి-1991 ప్రకారం ఈ విచారణ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశించారు.
Tags;Misappropriation of Municipal Funds