తిరుపతి ముచ్చట్లు:
కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి పూజ్యశ్రీ శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారిని టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి కల్యాణ మండపాల వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి శ్రీవారి తీర్థప్రసాదాలు సమర్పించి ఆశీస్సులు పొందారు. భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం టీటీడీ ఇటీవలి కాలంలో నిర్వహిస్తున్న పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈవో స్వామివారికి వివరించారు.
టీటీడీ చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలను స్వామివారు అభినందించి ఆశీస్సులు అందించారు.
Tags: TTD EO pays courtesy call on Sringeri Sharada Peetham Incharge