పుంగనూరుముచ్చట్లు:
ఆర్టీసి ప్రయాణాలు, ఆర్టీసి సేవలు ఎల్లప్పుడు పకడ్భంధిగా నిర్వహిస్తూ, ప్రజలకు సురక్షితంగా ఉందని కడప జోన్ ఆర్టీసి ఈడి రాఘవకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన బస్టాండ్, డిపో లను డిపీటీవో రాము, డిఎం దినేష్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడి ప్రయాణికులు, ఆర్టీసి కార్మికులు, సిబ్బందితో మాట్లాడి, ఆర్టీసి సేవలు, సమస్యలు తెలుసుకున్నారు. ఈడి విలేకరులతో మాట్లాడుతూ రహదారి ప్రయాణాలలో ఆర్టీసి భద్రత ప్రమాణాలను పటిష్టంగా పాటిస్తోందన్నారు. అలాగే కార్గోసేవల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండ అతి తక్కువ ధరకు వ్యాపారులకు ఆర్టీసి కార్గో సేవలు అందించడం హర్షనీయమన్నారు. ఈ విషయాలపై స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags; RTC Services Are Always Safe — ED Raghavakumar