April 17, 2026
Explore
ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు, జరిమానాలు

ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు, జరిమానాలు

April 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని రహదారులపై వాహనాలు, తోపుడు బండ్లు, బోర్డులు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తామని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. శుక్రవారం ఆయన సిబ్బందితో కలసి పట్టణంలోని ఎంబిటి రోడ్డు, బస్టాండ్‌, నాగపాళెం, సెంటర్‌లాడ్జి, ఆర్టీసి బస్టాండ్‌ రోడ్డు ప్రాంతాలలో ట్రాఫిక్‌ ఇబ్బంది కలిగిస్తున్న వారికి జరిమానాలు విధించారు. నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సిందేనన్నారు. రోడ్డుపై ఇష్టారాజ్యాంగ ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే ద్విచక్రవాహనదారులు వీలింగ్‌, భయంకరమైన హారన్లు , సైలెన్సర్లతో ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారన్నారు. ఈ వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండ ప్రజలు సహకరించాలన్నారు.

Tags; Cases and fines for causing traffic disruptions.