April 17, 2026
Explore
అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలి

అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలి

April 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రతి ఒక్కరు అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు సహకరించాలని ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ లు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని బయలుగానిపల్లెలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్సర్‌బాషా మాట్లాడుతూ బెట్టింగ్‌లు, సైబర్‌నేరాలు, మాదకద్రవ్యాల వినియోగంతో పాటు గంజాయి వినియోగం నేరమన్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రజలు తమకు సమాచారం అందించాలన్నారు. ఇలాంటి వారితో గ్రామాలు కలుషితమౌతుందని తెలిపారు.

Tags: Anti-social activities must be curbed.