April 17, 2026
Explore
కురబలకోట ఫ్లైఓవర్ వద్ద కారు ఢీకొని యువకుడు దుర్మరణం

కురబలకోట ఫ్లైఓవర్ వద్ద కారు ఢీకొని యువకుడు దుర్మరణం

April 17, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం, కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ వద్ద కారు ఢీకొని మోటర్ సైకిలిస్ట్ దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తంబళ్లపల్లి మండలం, బలకవారిపల్లి పంచాయతీ, బూదలవారిపల్లికి చెందిన రాజు కొడుకు సీలింగు చిన్నప్ప (30), డ్రైవింగ్ లైసెన్స్ కోసం మదనపల్లికి ద్విచక్ర వాహనంలో శుక్రవారం వచ్చాడు. పని పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో వెళుతుండగా, మార్గ మధ్యంలోని కురబలకోట, రైల్వే ఫ్లై ఓవర్ వద్ద కారు ఢీకొని చిన్నప్ప అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు… మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Tags: Young Man Dies Tragically After Being Struck by Car at Kurabalakota Flyover