మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో జరిగిన సమీక్షా సమావేశంలో జలధార–జలహారతి పనులను పక్కా ప్రణాళికతో, నాణ్యతగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. చెరువులు, వాగులు, కాలువల నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించి ఒక చెరువు నిండితే మరొక చెరువుకు నీరు చేరేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. పూడికతీత, కాలువల శుభ్రత, ఆక్రమణల తొలగింపును వేగవంతం చేయాలని, నరేగా కార్మికులను వినియోగించాలని తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఉద్యాన సాగుపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
Tags: Jaladhara works must be completed with quality: Collector