అమరావతి ముచ్చట్లు:
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగిస్తూ, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ఆందోళనలు ఉన్నప్పటికీ, 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను టీడీపీ వ్యతిరేకించడం లేదని తెలిపారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళల చిరకాల స్వప్నం ఈ బిల్లుతో నెరవేరబోతోందని, ఇది మహిళా సాధికారతకు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags: TDP Supports Two Bills: MP Lavu