పుంగనూరుముచ్చట్లు:
వృద్ధ మహిళ పట్ల చీరాల సీఐ శివకుమార్ ప్రవర్తించిన తీరును ఏపి రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ, ఎస్టీ, బీసి మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శంకరప్ప తీవ్రంగా ఖండించారు. మంగళవారం చీరాల ఘటనపై వారు స్పందించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడును కలసి సీఐపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. శంకరప్ప మాట్లాడుతూ నడిరోడ్డుపై ఒక దళిత వృద్ధ మహిళను అసభ్యపదజాలాలతో దూషించి, లాఠీతో కొట్టేందుకు ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. సీఐ ని విధుల నుంచి తొలగించి అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎంపిడిఎస్ ఉపాధ్యక్షులు రమణ, సభ్యులు రాజా, పెంచుపల్లి కృష్ణప్ప, గంగప్ప, కుమార్, సుబ్రమణ్యం, నాగరాజు, మారెమ్మ, రెడ్డెప్ప, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.
Tags: Action must be taken against the Chirala CI.