September 8, 2026
Explore
కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన

కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన

September 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది ఏరియా ఆసుపత్రి ముందు నల్ల మాస్క్లు ధరించి మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, వందశాతం స్థూల వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంభాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా , ఈపిఎఫ్‌ , ఆరోగ్య భీమా, బదిలీ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని జెఏసీ నాయకులు కోరారు.

Tags: Contract medical staff protest