పుంగనూరుముచ్చట్లు:
ఎన్టీఆర్ భరోసా నూతన పెన్షన్ల నమోదుకు అందిన ధరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని నియోజకవర్గ ప్రత్యేకాధికారి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని భీమగానిపల్లె సచివాలయాన్ని ఎంపీడీవో అప్పాజితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 7 నుంచి నూతన పెన్షన్ల నమోదు పక్రియను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Tags: Special Officer inspects pension registration.