April 17, 2026
Explore
వెంకయ్య స్వామి ఆలయం ధ్వంసం

వెంకయ్య స్వామి ఆలయం ధ్వంసం

April 17, 2026 | Andhra Pradesh

సూళ్లూరుపేట ముచ్చట్లు:

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని సాయి నగర్‌లో స్థానికులు శుక్రవారం వెంకయ్య స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే 24 గంటలు గడవకముందే గుర్తుతెలియని వ్యక్తులు నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ చర్య జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. గుడిని కూల్చిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు వద్ద డిమాండ్ చేస్తున్నారు.

Tags: Venkayya Swami Temple Vandalized