తిరుమల ముచ్చట్లు:
పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 523వ వర్థంతి మహోత్సవాన్ని మార్చి 15న తిరుమలలో టీటీడీ నిర్వహించనుంది.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కలిసి ఆలయానికి వేంచేపు చేస్తారు.
Tags: Tallapaka Annamayya’s 523rd death anniversary celebrations to be held in Tirumala on March 15