కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో బొలెరో వాహనం రెడీమిక్స్ లారీని ఢీకొనడంతో 8 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు.
ఘటనాస్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు.
గాయపడిన వారిని ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన భక్తులు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Tags: Bolero-Lorry Collision: 8 Dead