పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా ఈపూరు మండలం రెవెన్యూ సిబ్బందికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండలంలోని కొచ్చెర్లలో జరిగిన రీ సర్వేలో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్థులు ఈనెల 14న రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు కొచ్చెర్ల సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి, తహశీల్దార్ సంజాయిషీ ఇవ్వాలంటూ జాయింట్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Tags: Show-cause notices to revenue staff