April 16, 2026
Explore
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

April 16, 2026 | Andhra Pradesh

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులకు ఆయన నష్ట పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున నష్టపరిహారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఈ నష్ట పరిహారాన్ని అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని మోదీ స్పందించారు.

మంత్రాలయంలో కొలువుదీరిన శ్రీరాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు కర్ణాటక వాసులు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. ఈ వాహనం ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. 13 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, బాలికలు ఉన్నారు.

Tags: Horrific Road Accident in Kurnool District; PM Announces Compensation