July 26, 2026
Explore
భర్తపై బ్లేడ్‌తో దాడి.. భార్యపై అనుమానాలు

భర్తపై బ్లేడ్‌తో దాడి.. భార్యపై అనుమానాలు

July 26, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలం నీరుపాకోట గ్రామంలో భర్తపై బ్లేడ్‌తో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.

స్థానికుల కథనం ప్రకారం, 42 ఏళ్ల భీమయ్య మేస్త్రి పని చేస్తూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిస కావడంతో భార్య రేవతి (29)తో తరచూ గొడవలు జరుగుతుండేవని గ్రామస్థులు తెలిపారు.

శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఇద్దరూ ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో భీమయ్య గొంతు కోసిన స్థితిలో కనిపించాడు. ఈ విషయాన్ని భార్య రేవతి బంధువులకు తెలియజేయగా, వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అమరన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భీమయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

భీమయ్య తల్లి భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో భార్య రేవతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

భీమయ్య–రేవతి దంపతులకు 15 సంవత్సరాల క్రితం వివాహం కాగా, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags: Husband attacked with a blade; wife under suspicion.