July 26, 2026
Explore
27న విద్యార్థుల గర్జన మహార్యాలీ

27న విద్యార్థుల గర్జన మహార్యాలీ

July 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

విద్యహక్కు చట్టం అమలు కోసం సోమవారం పట్టణంలో నిర్వహించే విద్యార్థుల గర్జన మహార్యాలీకి ప్రతి ఒక్కరు తరలిరావాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్థి ఓబిసి సంఘ అధ్యక్షుడు వెంకట యాదవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జ్యోతిరావు పూలే సర్కిల్‌ నుంచి అంబేద్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొంటారని తెలిపారు.

Tags: ‘Students’ Roar’ Mega Rally on the 27th