April 16, 2026
Explore
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.

April 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో నేడు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. రానున్న మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపి ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

👉ఇదీ చదవండి ఎండాకాలంలో అప్రమత్తంగా ఈ జాగ్రత్తలు పాటించండి

  • నేటి నుంచి మూడు రోజులు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్లో పాటు నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం అవకాశం ఉందని పేర్కొంది.

Tags: Scorching heat is beating down across Telangana.